Title | చక్కని ఇంగ్లీషు సులభంగా నేర్చుకోండి |
Writer | గాజుల సత్యనారాయణ |
Rate | |
About PDF | తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించిన వారికి ఇంగ్లీషుభాషలో మాట్లాడాలన్నా, వ్రాయాలన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకం తయారు చేయబడినది. ఈ పుస్తకంలో ఇంగ్లీషు వర్ణమాలను ఎలా వ్రాయాలి? ఎలా పలకాలి అనే అంశాలతో ప్రారంభించి క్రమ క్రమంగా విస్తరిస్తూ అవరమైన చోట్ల ఇంగ్లీషును తెలుగు లిపిలో ఎలా పలకాలో వివరిస్తూ ఈ పుస్తకం సాగుతుంది. చిన్న చిన్న పదాల నిర్మాణం, ఇంగ్లీషు గ్రామర్, ఇంగ్లీషులో మర్యాదగా ఎలా మాట్లాడాలి?, స్పెల్లింగ్ నియమాలు, క్రియలు, కాలాలు, చిన్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు, పెద్ద అక్షరాలను ఎక్కడ ఉపయోగించాలి, పర్యాయపదాలు, వ్యతిరేక పదాలు, ఆర్టికల్స్, తెలుగులో వ్యావహారికంలో ఉన్న వ్యాకాలను ఇంగ్లీషులో ఎలా చెప్పాలి, తెలుగులోని లోకోక్తులు, సామెతలను ఇంగ్లీషులో ఎలా చెబుతారు? మొదలైన విషయాలు ఈ పుస్తకంలో వివరంగా చెప్పబడ్డాయి. ఇంతేగాక వర్గీకృత పదావళి (క్లాసిఫైడ్ ఒకాబ్యులరి)లో మనం నిత్యజీవితంలో మనకు రోజూ తారసపడే పదాలు అంటే మన శరీరంలోని భాగాలు, ఆహార పదార్థాలు, వ్యాధులు, వృత్తులు, పండ్లు, జంతువులు, కీటకాలు, పుష్పాలు, ఆభరణాలు, పక్షులు, సంగీత పరికరాలు ... ఇలా మన ప్రతి నిత్యం ఉపయోగంలో ఉన్న అనేక పదాలు, వాటిని ఎలా ఉచ్చరించాలి?, తెలుగులో వాటి సమానార్థకాలు .. ఇలా అందరికి ఉపయోగపడే సమాచారం ఈ పుస్తకంలో ఉన్నది. ఈ పుస్తకం విద్యార్థులకే కాకుండా, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, గృహిణులు. ... ఇలా ఆంగ్లభాషను నేర్చుకోవాలనునే ప్రతివారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. ఆంగ్లలో ప్రావీణ్యత సంపాదించాలనుకునేవారికి ఈ పుస్తకం ఎంతగానో సహాయపడుతుంది. |
Language | Telugu |
Any Queries Contact | feedback@nithra.mobi |
₹ 40
₹ 100 (60%)
₹
40 ₹
100 (60%)
© 2024 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved