Title | చక్కని ఇంగ్లీషు సులభంగా నేర్చుకోండి & మీ చిన్నారులకు ముచ్చటైన పేర్లు |
Writer | గాజుల సత్యనారాయణ |
Rate | |
About PDF | తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించిన వారికి ఇంగ్లీషుభాషలో మాట్లాడాలన్నా, వ్రాయాలన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకం తయారు చేయబడినది. ఈ పుస్తకంలో ఇంగ్లీషు వర్ణమాలను ఎలా వ్రాయాలి? ఎలా పలకాలి అనే అంశాలతో ప్రారంభించి క్రమ క్రమంగా విస్తరిస్తూ అవరమైన చోట్ల ఇంగ్లీషును తెలుగు లిపిలో ఎలా పలకాలో వివరిస్తూ ఈ పుస్తకం సాగుతుంది. చిన్న చిన్న పదాల నిర్మాణం, ఇంగ్లీషు గ్రామర్, ఇంగ్లీషులో మర్యాదగా ఎలా మాట్లాడాలి?, స్పెల్లింగ్ నియమాలు, క్రియలు, కాలాలు, చిన్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు, పెద్ద అక్షరాలను ఎక్కడ ఉపయోగించాలి, పర్యాయపదాలు, వ్యతిరేక పదాలు, ఆర్టికల్స్, తెలుగులో వ్యావహారికంలో ఉన్న వ్యాకాలను ఇంగ్లీషులో ఎలా చెప్పాలి, తెలుగులోని లోకోక్తులు, సామెతలను ఇంగ్లీషులో ఎలా చెబుతారు? మొదలైన విషయాలు ఈ పుస్తకంలో వివరంగా చెప్పబడ్డాయి. ఇంతేగాక వర్గీకృత పదావళి (క్లాసిఫైడ్ ఒకాబ్యులరి)లో మనం నిత్యజీవితంలో మనకు రోజూ తారసపడే పదాలు అంటే మన శరీరంలోని భాగాలు, ఆహార పదార్థాలు, వ్యాధులు, వృత్తులు, పండ్లు, జంతువులు, కీటకాలు, పుష్పాలు, ఆభరణాలు, పక్షులు, సంగీత పరికరాలు ... ఇలా మన ప్రతి నిత్యం ఉపయోగంలో ఉన్న అనేక పదాలు, వాటిని ఎలా ఉచ్చరించాలి?, తెలుగులో వాటి సమానార్థకాలు .. ఇలా అందరికి ఉపయోగపడే సమాచారం ఈ పుస్తకంలో ఉన్నది. ఈ పుస్తకం విద్యార్థులకే కాకుండా, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, గృహిణులు. ... ఇలా ఆంగ్లభాషను నేర్చుకోవాలనునే ప్రతివారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. ఆంగ్లలో ప్రావీణ్యత సంపాదించాలనుకునేవారికి ఈ పుస్తకం ఎంతగానో సహాయపడుతుంది. ఈ పుస్తకంలో మీ ముద్దులొలికే చిన్నారులకు అద్భుతమైన పేర్లు ఇవ్వబడ్డాయి. అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరుగా పేర్లు ఇవ్వడినవి. అంతేకాక ఈ పేర్లు అక్షరక్రమంలో ఇవ్వబడ్డాయి. సాంప్రదాయ సిద్ధమైన పేర్లతోపాటు, అత్యంత ఆధునిక పేర్లు, దేశ, అంతర్జాతీయ పేర్లను దృష్టిలో పెట్టుకొని ఈ పేర్ల రూపకల్పన చేయటం జరిగింది. ప్రతి పేరుకు ముందుగాని వెనుకగాని మీకు అనుగుణంగా పేర్లను (నాయుడు, రెడ్డి, చౌదరి ... ఇలా) కూడా చేర్చుకొనవచ్చును. అదే కొన్ని స్త్రీ నామమునకు ముందుగాని వెనుకగాని 'శ్రీ'ను కూడా చేర్చవచ్చును. ఉదాహరణకు 'జయ' అనే పేరుకు ముందు శ్రీ చేర్చి శ్రీ జయ అని, తరువాత శ్రీ చేర్చి జయశ్రీ అని కూడా మీ పిల్లలకు పేర్లు పెట్టుకొనవచ్చును. ఈ పుస్తకంలో మీ పిల్లలకు పేర్లు నిర్ణయించుకొనుటకు విస్తృతమైన పేర్ల జాబితాను ఇవ్వటం జరిగింది. ఇందువలన మీరు మీ పిల్లలకు అరుదైన, మీకు నచ్చిన పేర్లు పెట్టుకొనుటకు అవకాశం ఏర్పడుతుంది. ఇంతే కాకుండా ఇందులో చిన్నారులకు సంబంధించిన మరికొన్ని జాతక, జ్యోతిష వివరాలు కూడా ఇవ్వటం జరిగింది. జన్మ, నామ నక్షత్ర, రాశి, గణ చక్రము; జనన నక్షత్ర దోషాలు, వాటి పరిహారాలు; గండ నక్షత్ర జాతకులు జరిపించవలసిన తొమ్మిది రకాల శాంతులు వాటి వివరాలు; శాంతి చేయించుకొనవలసిన నక్షత్రాల జాబితా మొదలైన విషయాలతో పాటు; పురుడు తరువాత శిశువుతో అత్తవారింటికి ఎప్పుడు వెళ్ళాలి?, బిడ్డను ఎప్పుడు ఇంటి నుండి బయటకు తీసుకువెళ్ళాలి?, బిడ్డకు మొలత్రాడు ఎప్పుడు కట్టాలి? మొదలైన వాటికి సంబంధించిన తిథులు, నక్షత్రాలు; జన్మసమయ నిర్ణయం ఎలా జరుగుతుంది?, ఏది సరియైన పద్ధతి?... మొదలైన విషయాలతో పాటు ఇంగ్లీషు పద్ధతి ప్రకారం నామనక్షత్రం - రాశుల వివరాలు కూడా పొందుపర్చబడ్డాయి. ఇంతేకాక ఆరోగ్య విషయంగా బిడ్డ పుట్టినప్పటి నుండి 10 సంవత్సరం వచ్చే వరకు పిల్లలు ఉండవలసిన ఎత్తు, బరువు మొదలైన వివరాలు కూడా పట్టిక రూపంలో ఇవ్వబడ్డాయి. మీరు మీ పిల్లలకు ఏ పేర్లు పెట్టినా ముద్దు పేరుతో పిలుస్తారు కదా? అందుకొరకు కొన్ని ముద్దు పేర్లు కూడా ఇవ్వబడ్డాయి. అందులోనుంచి మీరు మీ అందమైన బిడ్డకు ముద్దు పేరును నిర్ణయించుకోవచ్చు. మీరు మీ పిల్లల పేర్లు నిర్ణయించుకొనేటప్పుడు లేదా మీ స్నేహితులు, బంధువుల పిల్లల పేర్లు నిర్ణయించుకొనేటప్పుడు ఈ పుస్తకం మీకు ఎంతగానో సహాయకారి కాగలదు. |
Language | Telugu |
₹ 40
₹ 70 (43%)
₹
40 ₹
70 (43%)
© 2025 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved